Header Banner

ఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

  Thu May 01, 2025 08:11        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్‌నిర్మాణ పనులు ఈ నెల 2న ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ పనులకు శ్రీకారంచుట్టనున్నారు. అయితే ప్రధాని మోదీ అమరావతి పనులతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మరో కొత్త మాల్‌ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్రం యూనిటీ మాల్‌ను ఏపీకి మంజూరు చేసింది. ఈ మాల్‌ను విశాఖలోని మధురవాడలో రూ.172 కోట్లతో నిర్మిస్తారు. దీని కోసం కేంద్రం మొదటి విడతగా రూ.86 కోట్లు ఇవ్వగా.. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా వర్చువల్‌గా యూనిటీ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 2026 మార్చి నాటికి మాల్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణానికి కేంద్రం రూ.172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా ఇస్తుంది.

మధురవాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 426/2లో 5 ఎకరాల స్థలంలో యూనిట్ మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మాల్ రుషికొండ బీచ్‌కు 5 కిలోమీటర్ల దూరంలో, సముద్రాన్ని ఆనుకుని కొండ ప్రాంతంలో ఉంటుంది. G+4 అంతస్తుల్లో మొదటి రెండు అంతస్తుల్లో 62 షాపులు ఉంటాయి. "వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్", భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతారు. ఇక ఈ యూనిటీ మాల్‌లోని మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని చూడవచ్చు (సీ వ్యూ). నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు చిన్న థియేటర్లు ఉంటాయి. ఇక్కడ రిటైల్ స్టోర్లు, ఫుడ్ కోర్టులు, వినోద ప్రదేశాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, బ్యాంకులు, ఫర్నిచర్ దుకాణాలు కూడా ఉంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. యూనిట్ మాల్ మాత్రమే కాదు.. ఇప్పటికే ప్రభుత్వం భూమని కూడా కేటాయించిన సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి: పాక్‌కు భారత్ భారీ షాక్! గగనతల తాళం వేసిన మోడీ సర్కారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradeshDevelopment #VisakhapatnamMall #UnityMall #ModiInAP #APInfrastructure #MadhurawadaMall #OneDistrictOneProduct